

- జెండా ఆవిష్కరణ చేసిన పర్వత రాజుబాబు.
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-
మండల కేంద్రం శంఖవరం శ్రీరామ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తించు కోవాలని శంఖవరం ఎంపీపీ పర్వత రాజబాబు అన్నారు. 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని శంఖవరం గ్రామంలో గల శ్రీరామ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎంపీపీ పర్వత రాజబాబు జెండా ఆవిష్కరణ చేసి, దేశ నాయకులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పర్వత మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం ఎంతో మంది పోరాట యోధుల త్యాగ ఫలితం, ఎంతోమంది నాయకుల పోరాటం కలగలిసి ఉందని అన్నారు. మన దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ చెప్పినట్లుగా నేటి బాలలే రేపటి పౌరులు, అన్నట్లు ప్రతి ఒక్క విద్యార్థి మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, పాటుపడి మన రాష్ట్ర, మన దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులకు పర్వత రాజబాబు సూచించారు. ప్రిన్సిపాల్ సకిరెడ్డి గోవిందరావు మాట్లాడుతూ విద్యార్థులంతా దేశభక్తిని కలిగి ఉండాలని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల గురించి, భారతదేశం గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థిని షణ్ముకేశ్వరి భరతమాత వేషధారణ, విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. పరుగు పందెం, మ్యూజికల్ చైర్, వ్యాసరచన, డ్రాయింగ్, క్విజ్ తదితర పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎంపీపీ పర్వత రాజబాబు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఆటల పోటీలలో బహుమతులు గెలుపొందిన విద్యార్థులను తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, యాజమాన్యం అభినందించారు. విద్యార్థులు సకిరెడ్డి మొనాలి,కట్టా నవ్య, రేలంగి ధనుశ్రీ, బండి తపస్వి,పిల్లా సత్య సౌమిక, కొప్పిశెట్టి పూర్ణిమ, చరిష్మా దేశభక్తి గేయాలను ఆలపించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు పర్వత వివేక్, బొమ్మిడి లిల్లియ్య, స్కూల్ సిబ్బంది జి నందిని,వి మాలతి, దేవి, బుజ్జి, భవాని, రామలక్ష్మి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.