

- పాఠశాలకు ఇన్వెటర్ బహుకరించిన మాజీ జడ్పిటిసి బచ్చల గంగ…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పెద్దమల్లపురం లో ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన మాజీ జడ్పిటిసి సభ్యురాలు బచ్చల గంగ పాఠశాలకు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇన్వెటర్ (విద్యుత్తు నిల్వ సరఫరా చేసే పరికరం) బహుకరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు విద్యార్థిని విద్యార్థులకు వెన్నలను అందజేశారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది కూటమి నాయకులు, విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు.