

ఉరవకొండ మన న్యూస్: 2024-2025 విద్యా సంవత్సరానికి బుదగవి గ్రామంలో చదివి అధిక మార్కులు సంపాదించిన ముగ్గురు విద్యార్థినులకు నగదు బహుమతులను పంపిణీ చేశారు. ఆర్థిక మంత్రి పర్యావుల కేశవ్, శ్రీనివాసులు సహకారంతో విద్యార్థినులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.
డి భవాని, నవ్యత నాగవేణి లకు మొదటి,రెండవ మూడవ బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి 5వేల రూపాయలు, రెండవ బహుమతి 3వేలు, మూడవ బహుమతి ₹2000 నగదు ప్రోత్సాహకాలను అందించినట్లు టిడిపి సీనియర్ నాయకులు చత్రగుడి చిరంజీవి తెలిపారు.