

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 15 //
కలిగిరి మండలం కుడుములదిన్నెపాడు ప్రాథమిక,వ్యవసాయ,సహకార సంఘము, నందు పి ఏ సి ఎస్ అధ్యక్షులు బాసం నరసింహ నాయుడు ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు, అనంతరం జెండాను ఎగరవేసి తదుపరి స్వీట్స్ మరియు చాక్లెట్లు పంచిపెట్టారు.అనంతరంఆయన,మాట్లాడుతూ,భారతదేశ చరిత్రలో ఆగస్టు 15,, 1947 అనే రోజు ఒక మహత్తరమైన రోజు శతాబ్దాల పాటు సాగిన బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన మన దేశం స్వతంత్ర గాలి పీల్చిన రోజు. ఇది కేవలం ఒక పండగ రోజు మాత్రమే కాదు ఇది త్యాగం పోరాటం దేశభక్తికి ప్రతీక అని ఆయన అన్నారు. మన దేశం స్వాతంత్ర దేశం రావడానికి,అనేకమందిరు తన ప్రాణాలను అర్పించారని అన్నారు.సుభాష్ చంద్రబోస్ సైనిక శక్తితో స్వేచ్ఛను సాధించాలని చేశారు, భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్, రాణీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు అలాంటి వీరులు తమ జీవితాలను యవ్వన దశలోనే త్యాగం చేశారని అన్నారు.స్వాతంత్ర దినోత్సవం మనకి కేవలం ఆనందాన్ని కలిగించే రోజు మాత్రమే కాదు ఒక బాధ్యతను గుర్తు చేస్తుందని అన్నారు.మనకు లభించిన ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం దేశాన్ని అభివృద్ధి తీసుకుని నడిపించడం అవినీతి అసమానత అజ్ఞానం వంటి సమస్యలను దూరం చేయడం మనందరికి అత్తయ్యమని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ మన హృదయాల్లో దేశ ప్రేమను గాలను మరింత తగిలిస్తుందని అన్నారు ఈరోజు మనమందరం ఒకటిగా కలిసి మన భారతమాత గౌరవం కోసం ప్రతిజ్ఞ చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బోలేనేని వెంకట రామారావు, మండల అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సీమల తాతయ్య, డబ్బుగుంటా బుజ్జియ్య, గంగవరపు మదన్ స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.