

గూడూరు, మన న్యూస్ :- నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ(ఎన్ డి.సి.ఏ) వారు గూడూరుకు చెందిన ప్రముఖ సామాజిక వేత్త శ్రీ కృష్ణ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ బండి శ్యామసుందరరావు (మయూరి శ్యామ్ యాదవ్ )కు జాతీయ అవార్డు-2025 ఇవ్వడం జరిగింది. మయూరి శ్యామ్ యాదవ్ అనేక సామాజిక సేవ కార్యక్రమంలు చేయడంతో అది గుర్తించిన ఎన్.డి.సి.ఏ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈసందర్భంగా మయూరి శ్యామ్ యాదవ్ జాతీయ స్థాయిలో అవార్డు దక్కినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ఇచ్చిన ఎన్. డి.సి.ఏ నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్ గారికి మయూరి శ్యామ్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపేను ……
మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ నేను చేయు సేవా కార్యక్రమాలకు ఆ దేవ దేవుడు శ్రీ కృష్ణ పరమాత్మడు ఆశీస్సులు నా తల్లదండ్రులు వనమ్మ ,కృష్ణయ్య దీవెనలతో పాటు మయూరి స్వీట్స్ మరియు వనజాకృష్ణ కళ్యాణ మంటపం సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు…..