

రాయదుర్గం, మన న్యూస్:ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం రాయదుర్గం పట్టణంలో ధర్నాకు దిగారు. ఏపీ ఎన్జీవో తాలూకా అధ్యక్షుడు కెంచే లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో, కార్మికులకు తక్షణం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, నాలుగేళ్లుగా నిలిచిపోయిన ప్రమోషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు మాట్లాడుతూ, ప్రస్తుత ఈహెచ్ఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత వైద్య విధానంను తిరిగి అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి తిప్పేస్వామితో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.