

మన న్యూస్ నారాయణ పేట జిల్లా :
భారీ వర్షాలు వస్తున్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలి.
దొంగతనాల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.
కోస్గి మండల కేంద్రంలోని అట్కర్ గల్లిలో బుధవారం తెల్లవారుజామున 06 గంటల నుండి 08 గంటల వరకు 60 మంది పోలీసు అధికారులు, సిబ్బంది తో ఆకస్మికంగా (కార్డెన్ సెర్చ్) కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి సుమారు 250 ఇండ్లను సోదాలు నిర్వహించి కొంతమంది వ్యక్తిగత వివరాలు సేకరించి ఎవరైనా కొత్త వ్యక్తులు ఉన్నారా అని మరియు సరైన పత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా డిఎస్పి నల్లపు లింగయ్య మాట్లాడుతూ, నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని మరియు చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వాహనాల సంబందించిన అని ధ్రువపత్రాలు కల్గి ఉండాలి అన్నారు. మహిళ పట్ల, చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, చట్టపరమైన చర్యలుతీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు.ప్రజలు, మహిళలు ఆపద సమయంలో స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజల రక్షణ కొరకు పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారు అని తెలిపారు. గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు స్వచ్ఛందంగా సీసీ. కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ తెలిపారు. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రాబోయే పండుగలను ప్రజలంతా కుల మతాలకతీతంగా శాంతియుతంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ప్రజల భద్రత శాంతి భద్రత పరిరక్షణ కోసం ఇలాంటి కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని డీఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో కోస్గి సీఐ సైదులు, ఎస్ఐ లు బాలరాజు, విజయ్ కుమార్, రాముడు, ఎస్ ఏం నవీద్, రమేష్, మహేశ్వరి, గాయత్రి, పోలీసు కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.