

శంఖవరం/ రౌతులపూడి మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని రౌతులపూడి మండలం గిడజం గ్రామంలో ఆంజనేయస్వామికి వైసిపి నాయకులు పూజలు నిర్వహించారు. అదే గ్రామంలో గ్రామ దేవత ముసలమ్మ తల్లి కి మహిళలు భక్తిశ్రద్ధలతో లలిత పారాయణం చేసి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని అమ్మవారికి పూజలు నిర్వహించారు.