

ఉరవకొండ, మన న్యూస్: గవి మఠ పరిసరాల్లో పలు అభివృద్ధి పనులు, మరమ్మత్తుల కోసం నిధులు కేటాయించినట్లు సమాచారం. కర్నూలు దేవదాయ ధర్మదాయ శాఖకు చెందిన డిప్యూటీ ఇంజనీర్, మేనేజర్ కే. రాణితో కలిసి మఠ పరిసరాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అవసరమైన మరమ్మత్తులు, అభివృద్ధి పనుల అంచనాలను సిద్ధం చేసి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. మఠ బావిలో పూడిక పేరుకుపోయి ఉండటం, ఆవరణలో అపరిశుభ్రత నెలకొనడం, పలు గదులు శిథిలావస్థకు చేరుకోవడం వంటి సమస్యలు గుర్తించారు. వీటి మరమ్మత్తుకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో ఏళ్ళ నారాయణ స్వామి, సిబ్బంది కరిబసి తదితరులు పాల్గొన్నారు.