ఫ్రెష్ బస్సు వారు తన ఎలక్ట్రికల్ బస్సులలో స్లీపర్ సదుపాయాన్ని విశాఖపట్నం __విజయవాడ__ గుంటూరు రూట్లలో సేవలను ప్రవేశపెట్టింది.

ఫ్రెష్ బస్ వారు ఎలక్ట్రిక్ బస్సులలో స్లీపర్ సదుపాయాన్ని విశాఖపట్నం-విజయవాడ & గుంటూరు రూట్ లో సేవలను ప్రవేశపెట్టింది.మన న్యూస్ ,గుంటూరు, ఆగస్టు 12: 2025 ,జూన్ లో ఫ్రెష్ బస్ వారు విశాఖపట్నం -విజయవాడ-గుంటూరు మధ్యన సీటింగ్ సౌకర్యంతో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశ పెట్టారు. ప్రయాణికుల సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఫ్రెష్ బస్ వారు ఎలక్ట్రిక్ వాహానాలను స్లీపర్ సదుపాయంతో ఆవిష్కరించారు. ఫ్రెష్ బస్ సుదీర్ఘ ప్రయాణాలకు కాస్త విరామమంగా మిడ్ పాయింట్ ఏర్పాటుచేస్తుంది. విశాఖపట్నం -విజయవాడ-గుంటూరు ఫ్రెష్ బస్ నకు రాజమండ్రి వద్ద మిడ్ పాయింట్ ఏర్పాటుచేసి అక్కడ ప్రయాణికులకు రుచికరమైన తాజా ఆహారం మరియు శుభ్రమైన వాష్ రూమ్ సదుపాయం కలిగిస్తున్నది.ఈ ఇంటర్ సిటీ ఫ్రెష్ బస్ ఆవిష్కరణ ప్రయాణికుల ఆలోచనలకు అనుగుణంగా వారికి నిరంతర సేవలు అందించుటను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం -విజయవాడ-గుంటూరు మధ్యన ఎలక్ట్రిక్ స్లీపర్ బస్సును ప్రవేశపెట్టటం తమకు చాల సంతోషంగా ఉంది అన్నారు ఫ్రెష్ బస్ వ్యవస్థాపకులు మరియు CEO సుధాకర్ చిర్రా. ఈ కీలకమైన మార్గంలో సుదూర ప్రయాణాలు మరింత సౌకర్యంగా ప్రయాణికులు కొనసాగించుటకు ఈ స్లీపర్ సదుపాయం కలిగించుట ద్వారా ఫ్రెస్ బస్ మరో ముందడుగు వేసింది అన్నారు. ఈ ఫ్రెష్ బస్ స్లీపర్ ప్రయాణం అత్యంత పరిశుభ్రతను కలిగి ఉంటుందని, మార్గ మధ్యలో రాజమండ్రిలో ఆగినపుడు ప్రయాణికులకు తాజా వేడి భోజనం రుచి చూడటమే కాక కాస్త విశ్రాంతి కూడ తీసుకోవచ్చునని ఆయన చెప్పారు. ఇది ఒక ప్రయాణంలా కాక చక్కని విహార యాత్ర అనుభూతి కలిగిస్తుంది అన్నారు.ఫ్రెష్ బస్ ప్రయాణాలను ప్రయాణికుల అభిరుచి మరియు సంతృప్తిని దృష్టిలో ఉంచుకుని సుస్థిరంగా మరియు సదుపాయకరంగా నిర్వహించడమే తమ లక్ష్యమని సుధాకర్ చిర్రా ఈ సందర్భంగా వివరించారు. ఫ్రెష్ బస్ టికెట్ డిజిటల్ బుకింగ్ దగ్గర నుంచి బస్సు చిట్ట చివరి గమ్యస్థానం వరకు ప్రయాణంలోని ప్రతి అంశము ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రూపకల్పన చేసామని, ప్రయాణికులు ఈ సౌకర్యాలను ఆనందంగా ఆస్వాదిస్తారని ఆయన అన్నారు.అన్ని ఫ్రెష్ బస్ ఎలక్ట్రిక్ బస్సులు పరిశుబ్రంగా నిశ్శబ్దంగా పనిచేసే ఎయిర్ కండీషన్ క్యాబిన్ లతో  మరియు పర్యావరణ స్నేహ పూరితమైన ప్రయాణాలకు అనుకూలం. పరిశుభ్రమైన & విశాలమైన స్లీపర్ బెర్త్‌లు. ప్రయాణంలో ఉచిత స్నాక్స్ మరియు పానీయాలు. శిక్షణ పొందిన యూనిఫాం ధరించిన  ఫ్రెష్ బస్ సిబ్బంది విలువైన సేవలు అందిస్తారు.   ప్రతి బస్సు ప్రయాణం ఒక అద్భుతంగా మంచి విలువలతో సాగాలనే ఆలోచనలతో ప్రయాణికులకు లాయల్టీ అందిస్తున్నాది. ప్రతి వంద కిలోమీటర్ల ప్రయాణానికి 10 గ్రీన్ కాయిన్స్ అందిస్తున్నాది. ప్రయాణికులు వీటిని తమ తదుపరి ప్రయాణ టిక్కెట్ల కొనుగోలు సమయంలో ఉపయోగించవచ్చును. విశాఖపట్నం-విజయవాడ & గుంటూరు మరియు ఇతర ఫ్రెష్  బస్ రూట్ల టిక్కెట్లు  freshbus.com లేదా ఫ్రెష్ బస్ యాప్ లో అందుబాటులో ఉంటాయి. తరచుగా ప్రయాణించే వారు 10 రైడ్ లలో ఒక్కో రైడ్ కు రూ.50/- ఆదా చేసుకోవడానికి  ఫ్రెష్ కార్డును  కొనుగోలు చేయవచ్చునని ఈ కార్డు ఆరు నెలలు పాటు చెల్లుబాటులో ఉంటుందని వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలు రాక వేగం పుంజుకుంటున్నందున ఫ్రెష్ బస్ భారతదేశం అంతటా ప్రయాణాలు కొనసాగించుటకు కట్టుబడి ఉంది అన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 1 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు