బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం,మద్యం తాగి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం.

బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసులు.

బంగారుపాళ్యం నవంబర్ 30 మన న్యూస్:- మద్యం తాగి వాహనాలు నడిపిన 06 గురికి 10,000 చొప్పున 60,000/- రూ. మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన 07 మందికి 1,000 చొప్పున 7,000/- రూ మొత్తం 67,000/- రూ జరిమానా విధింపు.**జిల్లా ఎస్పీ వి.ఎన్ మణికంఠ చందోలు, ఐపీఎస్ ఆదేశాల మేరకు పలమనేరు సబ్ డివిజన్ డి.ఎస్పీ ప్రభాకర్ ఆద్వర్యంలో బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ కత్తి .శ్రీనివాసులు నిన్నటి దినం వాహన తనిఖీ చేస్తున్న సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఇద్దరు(6) పట్టుబడగా, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ 07 మంది పట్టుబడ్డారు. ఈ రోజు ఉదయం వీరిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టుకు హాజరుపర్చగా, జడ్జి శ్రీమతి ఉమా దేవి గారు మద్యం తాగి వాహనాలు నడిపిన వ్యక్తులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 60,000/- రూపాయలు జరిమానా విధించారు. అదేవిధంగా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 07 మందికి ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున 7,000/- రూపాయలు జరిమానా విధించారు. మొత్తం 67,000/- రూపాయల జరిమానా విధించడం జరిగింది. బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ శ్రీ కె.శ్రీనివాసులు గారు మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని, అటువంటి నియమాలు పాటించకపోతే భారీ జరిమానాలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు. మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదకరమైన చర్యగా, ఇది తమ ప్రాణాలకు మరియు ఇతరుల ప్రాణాలకు భయానక ప్రమాదం అని తెలిపారు. సెక్షన్ 185 ప్రకారం, మద్యం సేవించి వాహనం నడపడం పై మొదటిసారి రూ. 10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష, రెండవసారి నేరం చేస్తే రూ. 15,000 లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని ఇన్స్పెక్టర్ గారు వివరించారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు