

- మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి
*శంఖవరం/అన్నవరం మన న్యూస్ ప్రతినిధి:-
మాజీమంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని ప్రజలకు సేవలు అందించాలని మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి అన్నారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో సత్యదేవుని దర్శించుకున్న అనంతరం లక్ష్మీ సమేత ఆయుష్ హోమం కార్యక్రమంలో పాల్గొని ముద్రగడ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం నియోజకవర్గానికి చేసిన సేవలు ప్రజలు చిరస్థాయిలో నిలిచయాన్నారు. ముద్రగడ పద్మనాభం సత్యదేవుని ఆశీస్సులతో త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవలు అందించాలని సత్యదేవునికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి కాకి నాని, వైసిపి నాయకులు పాల్గొన్నారు.