

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్ ) పెద్దకొడప్ గల్, ఆగస్టు 10 :పెద్దకొడప్ గల్ మండలంలో సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు పర్యటించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన వివరాలు చెబుతూ— మధ్యాహ్నం 12.30 గంటలకు ఎమ్మెల్యే గురుకుల పాఠశాలను సందర్శించి, లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను అందజేస్తారని చెప్పారు. అనంతరం సిఎంఆర్ఎఫ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయనున్నారు.పర్యటన చివరగా మండల కేంద్రంలో వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మహేందర్ రెడ్డి కోరారు.