ఏకలవ్య పనులపై విజిలెన్స్ దర్యాప్తు జరిపించాలి – ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్వర రావు

మన న్యూస్ సాలూరు రూరల్, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లా,కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో నిర్మిస్తున్న, నిర్మించిన ఏకలవ్య భావనాల నాణ్యతను విజిలెన్స్ అధికారులు పరిశీలించాలని, గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని గిరిజన ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్వర రావు అన్నారు. ఆదివారం ఉదయం విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 35కోట్లతో పనులు చేపట్టిన గుత్తేదారు కృష్ణంరాజు నుండి ఈఎన్సీ శ్రీనివాసరావు ఐదు కోట్ల 50లక్షల రూపాయిలను పర్శంటేజీల రూపంలో డిమాండు చెయ్యడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాక్టు పనుల్లో పర్శంటేజీలనేవి సర్వ సాధారణం కాగా, ఈ స్థాయిలో డిమాండ్ చెయ్యటం వెనుక బలమైన కారణం ఉండి ఉండవచ్చన్నారు. పనుల నాణ్యతా, ప్రమాణాల విషయంలో ఇరువురు రాజీ పడి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేసారు. కావున కాంట్రాక్టర్ కృష్ణం రాజు చేపట్టిన ఏకలవ్య పనుల బిల్లులు చెల్లించక ముందే, వీటిపై విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టి పనుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలన్నారు. అంతేకాకుండా త్వరలో రిటైర్ కావల్సిన వ్యక్తికి మరో రెండేళ్ల పాటు అతని ఉద్యోగ కాలాన్ని పొడిగించేందుకు ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసు వెనుక భారీ మొత్తం చేతులు మారి ఉండవచ్చన్నారు. అంతకు ముందు ఈఎన్సీ పై ఉన్న అవినీతి, విజిలెన్స్, ఏసీబీ కేసులను కొట్టేస్తూ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడం వెనక గల కారణాలను పరిశిలించాలన్నారు. అంతేకాకుండా ఈఎన్సీ గత రెండు నెలలుగా ఎవరితో మాట్లాడారు, ఎంత సమయం మాట్లాడారో పరిశీలిస్తే ఆయన వెనుక ఉన్న పెద్ద మనుష్యులు వెలుగులోకి వస్తారన్నారు. కావున కూటమి ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే తమ నేతల ఒత్తిడికి తలొగ్గకుండా ఈఎన్సీ కాల్ డేటాను పరిశీలించాలన్నారు. గిరిజన విద్యార్థుల చదువు కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నదని, కావున వాటిని సక్రమంగా ఖర్చు పెట్టించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 2 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు