

మనన్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) ఆగస్టు 10,నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును క్యాంప్ కార్యక్రమంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామంలో సర్వే నంబర్ 765లో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్య పరిష్కారం,మల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుండి మల్లూరు తాండా బీటీ రోడ్డు వరకు ఫార్మేషన్ రోడ్డు నిర్మాణం,ఏటిగడ్డ వద్ద సూది రెడ్డి రామ్ రెడ్డి వ్యవసాయ పొలం సమీపంలో మాంజీర నదిపై హైలేవర్ బ్రిడ్జి నిర్మాణం, మల్లూరు తాండా రోడ్డునుంచి పల్లె శివారు వ్యవసాయ భూములకు వెళ్లే మార్గంలో మాసిరెడ్డి చెరువు కాలువపై వంతెన నిర్మాణం, అలాగే మల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులను చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను వెంటనే ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఒంటరి శ్రీనివాస్ రెడ్డి,బుడిమి శ్రీనివాస్, పెద్ది అంజయ్య, నాగంపల్లి కృష్ణ,బి. శ్రీధర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.