

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ నాయకపోడ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి, ఆదివాసీ జెండాను ఎగురవేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..ఆదివాసీ నాయకపోడ్లు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని,ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అలాగే కొమురం భీమ్ ఆశయాల మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మన్నె సాయిలు,రాజు,మొట్ట భూమయ్య,నాగరాజు, సాయిలు,సంతోష్,అంజయ్య, పోషయ్య,గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి,సాయగౌడ్, అబ్జాల్,ఆంజనేయులు, సాయిలు,తదితరులు ఉన్నారు.