

- ఆర్ అండ్ బి అధికారులకు ఫిర్యాదు చేసిన సామాజిక ఉద్యమ నేత మేకల కృష్ణ…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-
ప్రజా రవాణా రోడ్డుపై మళ్లీ అధిక బరువులు కలిగిన లెట్రేట్ లారీల రవాణాను తక్షణం నిరోధించాలని ఎస్.ఈ, ఆర్ అండ్ బి అధికారులకు సామాజిక ఉద్యమ నేత మేకల కృష్ణ శుక్రవారం ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేశారు.కాకినాడ జిల్లా రౌతులపూడి,శంఖవరం, మండలాలకు చెందిన టికే రోడ్డు {తుని-కత్తిపూడి రోడ్డు}పైన మళ్ళీ భారీస్థాయిలో లెట్రేట్ మట్టిని రావికంపాడు రైల్వేస్టేషన్ కు తరళించే బారీబరువులు కల్గిన లారీలు ఆక్రమంగా రవాణా చేయడం జరుగుతుందని, ఆధికబరువులు కల్గిన లెట్రేట్ లారీల రవాణాను ప్రజారవాణా రోడ్డు అయిన టి.కె. రోడ్డు {తుని-కత్తిపూడి ఆర్ అండ్ బి రొడ్డు}పైన తక్షణం నిరోధించాలనే ఉద్దేశంతో గత నెల 21 వ తేదీన నిరసనదీక్ష భగ్నం సందర్భంలో అధికారులు మౌఖికంగా ఇచ్చిన హామీ మేరకు అప్పటి నుండి అధికబరువులు కల్గిన లెట్రేట్ లారీలు రవాణా కొంతమేరకు తగ్గడం జరిగింది.కాని మళ్ళీ నిన్నటి నుండి అనగా ది;07-08-2025వ తేది గురువారం నుండి భారీస్థాయిలో అధికబరువులు కల్గిన లెట్రేట్ లారీలు తుని-కత్తిపూడి ఆర్ అండ్ బి రోడ్డుపైన రవాణా జరుగుతుందని, జిల్లా ఆర్ అండ్ బి ఎస్ఈ వారికి వాట్సప్ ద్వారా పిర్యాదు చేస్తూ, లెట్రేట్ లారీల ఆక్రమరావాణా కారణంగా తుని-కత్తిపూడి ఆర్ అండ్ బి రోడ్డుకు ఇరువైపులా ఉన్నా గ్రామాలప్రజలు,రొడ్డుకు ఇరువైపుల గల నివాసగృహాల ప్రజలు తీవ్రస్థాయి ఇబ్బందులు పడుతున్నారని, అధికబరువులు కల్గిన లెట్రేట్ లారీల రవాణాను తక్షణం నిరోధించుటకు రోడ్డులు,భవనాల శాఖ జిల్లాస్థాయి అధికారిగా ప్రజల బాధలను మానవీయ కోణంలో ఆలోచించి తక్షణం తగు చర్యలు తీసుకోవాలని వాట్సాప్ ద్వారా సమాచారాన్ని పంపించడం జరిగిందని సామాజిక ఉద్యమ నేత మేకల కృష్ణ తెలిపారు. ఈ ప్రాంత ప్రజల రోడ్డు కష్టాలపై సానుకూలంగా స్పందించి తక్షణం అధికబరువులు కల్గిన లెట్రేట్ లారీలు ప్రజారవాణా రోడ్డుపైన అక్రమరవాణా చేయకుండా తక్షణ ఆపుజేయుంచుటకు తగు చర్యలు తీసుకొవలసినదిగా కోరుతూ ఆర్ అండ్ బి ఎస్ ఈ వారి సెల్ 9440818024 నెంబర్ కు సమాచారాన్ని పంపించడం జరిగిందన్నారు. టి కె రొడ్డు అయిన ప్రజారవాణా రొడ్డు పై ప్రజలకు ఉపయోగం లేని,ప్రజా ఆరోగ్యానికి ప్రమాదకరమైన రవాణా తో అధికబరువులు కల్గిన లెట్రేట్ మట్టి లారీలు ఆక్రమరవాణా నిలుపుటకు న్యాయ ప్రకియలో చేయుటకు కొంత సమాచారం కొంతమంది అధికారుల నుండి రావలసియున్నాదని ఈ విషయమై సమాచారం హక్కుచట్టం-2005 ప్రకారం ఇప్పటికే ధరాఖాస్తు చేయడం జరిగిందని తెలిపారు.