

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 8:* మైపాడుగేట్ వద్ద స్మార్ట్ సిటీలో ఏర్పాటుచేస్తున్న కంటైనర్లను పరిశీలించిన మంత్రి .* కంటైనర్లు తీసుకున్న మెప్మా మహిళలకు సొంత నిధి నుండి ప్రతి మహిళకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన మంత్రి.* మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపిన మెప్మా మహిళలు* ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం.* మంచి చేస్తుంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఓర్వలేక పోతుంది.మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఇందులో భాగంగా మైపాడు గేట్ స్మార్ట్ సిటీ లో ఏర్పాటుచేస్తున్న కంటైనర్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.తమ ఆర్థికాభివృద్ధికి షాపులు కేటాయించి, లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసిన మంత్రికి మెప్మా మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు సిటీ లో 1000 మంది మెప్మా మహిళలకు షాపులు కేటాయించాలన్నది తమ లక్ష్యమని.అందులో భాగంగానే తొలివిడతలో 240 షాపులు ఆమోదం తెలిపామన్నారు.20 షాపులు ఈ నెలలోనే ప్రారంభిస్తామని ఒక్కొ షాపు ఏర్పాటుకు నాలుగులక్షలు ఖర్చు అవుతోందన్నారు..మెప్మా ,కార్పొరేషన్ లనుంచి రెండు లక్షలు సబ్సిడీ వస్తుందని రెండులక్షలు బ్యాంకు ఋణం ఇస్తుందన్నారు..షాపులు తీసుకొన్న మహిళలకు ఒక్కొక్కరికి లక్షరూపాయలు సొంత నిది నుంచి ఇస్తానన్నారు. బ్యాంకులోను లక్ష రూపాయలే ఉంటుందన్నారు..చెన్నై బర్మబజార్ లో వ్యాపారాలను పరిశీలించేందుకు మెప్మా మహిళలను పంపించామన్నారు..ఈ ఐదేళ్లలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని ఘంటా పదంగా తెలిపారు..వెయ్యి మందికి నా కుటుంబం నుంచి లక్ష రూపాయల చొప్పున ఆర్థికసహాయం అందిస్తానన్నారు.. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను తూచా తప్పక అమలు చేస్తామని..ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోయినా అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తున్నామన్నారు..మంచి చేస్తుంటే వైఎస్సార్సీపీ ఓర్వలేకుందిని..పనిలేక కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారన్నారు..నేను మాటల మంత్రిని కాదని ,చేతల మంత్రిని నారాయణ తెలిపారు..ఎవరెన్ని చేసినా అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతాను అన్నారు.. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, లెక్కల వెంక రెడ్డి,నారాయణ రెడ్డి,శేషమ్మ,రత్నమ్మ, టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


