నెల్లూరు నగరం పై పట్టు బిగించిన మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు, ఆగస్టు 8:* పార్కుల ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి* పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి* చిల్డ్రన్స్ పార్క్ లో 25 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్లే ఎక్విప్మెంట్ను ప్రారంభించిన మంత్రి నారాయణ* ప్రభుత్వానికి చెందిన సెంటు భూముని కూడా అన్యాక్రాంతం కానివ్వం* చిల్డ్రన్స్ పార్క్ న్యూ మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతాం* ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాంఅభివృద్ధి ధ్యేయంగా నెల్లూరులో మంత్రి నారాయణ పట్టు బిగించారు. నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు.మొదటగా బోడిగాడి తోట ,బంగ్లాతోట , బాలభవన్ ,రేబాల వీధి ,ఎన్టీఆర్ నగర్ వాటర్ ట్యాంక్ ,మూడు జెండాల సెంటర్ ,ఎంఎస్ఎం పార్కుల ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు.పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్లను దిశా నిర్దేశం చేసి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం చిల్డ్రన్స్ పార్కులో 25 లక్షలతో ఏర్పాటు చేసిన ప్లే ఎక్విప్మెంట్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు.ముందుగా ఆయనకు రాష్ట్ర నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.చిల్డ్రన్స్ పార్క్ లో పర్యటించారు ..భారీ ప్లే ఎక్విప్ మెంట్ ఏర్పాటు చేసిన మంత్రికి చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు.. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాటప్రకారం 25 లక్షలతో ప్లే ఎక్విప్ మెంట్ ఏర్పాటు చేశామని..నగరంలోని 54 డివిజన్ లలో పార్కుల అభివృద్ధిని కన్సల్టన్సీకి అప్పచెబుతానాని తెలిపారు..మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయమని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.. అన్ని పార్కులను సుందరీకరిస్తామని..చిల్డ్రన్స్ పార్కును మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతామన్నారు..లే అవుట్ లలో ప్రభుత్వానికి చెందిన సెంటు భూమిని కూడా అన్యాక్రాంతం కానివ్వంమని తెలిపారు..గతప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు..ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని..సిటీ ,రూరల్ లో మేము చెప్పిన ప్రతీ మాటని నిలబెట్టుకొంటామన్నారు.. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడారు. మంత్రి చొరవతో సీటీ ,రూరల్ నియోజక వర్గాల్లో అభివృద్ధి పరుగులు తీస్తోందిని..వీఆర్ హైస్కూల్ అడ్మిషన్లు పారదర్శకంగా చేసారన్నారు..రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ గా నిలబెట్టారని హర్షం వ్యక్తం చేశారు..కొంతమంది కావాలని విమర్శలు చేస్తున్నారని..వాటిగురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు..వాస్తవాలు ప్రజలకు తెలుసన్నారు..పార్కుల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చేసిన ఘనత మంత్రి నారాయణ కె దక్కుతుందన్నారు.ఈకార్యక్రమంలో కమీషనర్ నందన్ ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,మాజీ మున్సిపల్ చైర్పెర్సన్ తాళ్ళపాక అనూరాధ ,మాజీ జెడ్పిటిసీ విజేతా రెడ్డి ,నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు ,కార్పొరేటర్లు ,పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు ,క్లస్టర్ ఇంచార్జిలు ,టీడీపీ నేతలు పాల్గొన్నారు .

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///