

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం బాలిరెడ్డి నగర్‌లోని MPP పాఠశాలలో గురువారం ఉదయం విద్యార్థులందరికి ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, సింగరాయకొండ శాఖ ఆధ్వర్యంలో, 8వ వార్డు సభ్యులు శ్రీ తన్నీరు నాగేశ్వరరావు గారి సమన్వయంతో నిర్వహించబడింది.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కోటపాటి నారాయణ గారు మాట్లాడుతూ, విద్యార్థులు అధికంగా చదివి మంచి భవిష్యత్తు కోసమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మానవతా శాఖ సెక్రటరీ జెడీ వెంకట సుబ్బారావు గారు విద్యార్థులందరూ శుభ్రంగా, చక్కని దుస్తులతో పాఠశాలకు హాజరుకావాలనీ ఆకాంక్షించారు.మండల శాఖ చైర్మన్ శ్రీమతి గుంటక రామలక్ష్మమ్మ గారు మాట్లాడుతూ, విద్యార్థులు దేవి సీ ఫుడ్స్ సంస్థ ఉచితంగా అందిస్తున్న మినరల్ వాటర్‌ను వినియోగించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా మానవతా ట్రెజరర్ మహంకాళి నరసింహారావు, జాయింట్ సెక్రటరీ బి. పూర్ణచంద్రరావు, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి పి. లక్ష్మి మరియు శ్రీమతి యం. ఉమామహేశ్వరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.