

– జిల్లా కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ కుసుమలక్ష్మి…
శంఖవరం/కాకినాడ మన న్యూస్ ప్రతినిధి:-
విద్యార్థులలో మానసిక వికాసం అనేది వారి ఆలోచన, భాష, సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు జ్ఞాపకశక్తి వంటి మేధోపరమైన సామర్థ్యాలు అభివృద్ధి చెందే ప్రక్రియ అని కాకినాడ జిల్లా కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ కుసుమ లక్ష్మి అన్నారు. కాకినాడ రూరల్ పి. వెంకటాపురం అంబేద్కర్ గురుకులంలో బుధవారం కాకినాడ జిల్లా కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ కుసుమ లక్ష్మి పిల్లలలో మానసిక వికాసం భావోద్వేగాల సమతుల్యత లక్ష్యసాధన గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒత్తిడిని జయిస్తూ మంచి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు ప్రేరణ కలిగించడం జరిగిందన్నారు.ఆలోచన, భాష, సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు జ్ఞాపకశక్తి కంటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పరిమళ, ఉపాధ్యాయురాలు శశికళ, స్టాఫ్ నర్స్ చక్రమ్మ, మరియు సిబ్బంది పాల్గొన్నారు.