

మన న్యూస్: తిరుపతీ 2017 వ సంవత్సరంలో పేద మధ్యతరగతి కుటుంబాల వారికి తక్కువ ధరకు నాణ్యమైన ఇంటర్నెట్, ఛానల్స్, ఫోన్ కాల్స్ అందించుట కొరకు ఏర్పాటు చేసినదే ఏపీ ఫైబర్ నెట్ అని ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం తిరుపతిలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయినా ఏపీ ఫైబర్ నెట్ లో గతంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి ప్రక్షాళన చేస్తామని, గత ప్రభుత్వం 10 లక్షలు పైగా ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లను ఉద్దేశపూర్వకంగా ఎక్కువ ధర కు పెంచడం, కొన్ని చానల్స్ ను తొలగించడం, ఆపరేటర్లను ఇబ్బంది పెట్టడం వంటి వివిధ కారణాలతో ఐదు లక్షల కనెక్షన్లకు పడిపోయాయని, ఏపీ ఫైబర్ నెట్ ను గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక పోక , వివిధ దశలలో కొందరుతో చేతులు కలిపి వస్తు సమగ్ర కొనుగోలులో, నియామకలలో చాలా అవినీతి జరిగిందని దీనిపైన విజిలెన్స్ కు ఫిర్యాదు చేసామన్నారు. కొంతమంది కేబుల్ ఆపరేటర్లతో పూర్తిస్థాయిలో పడిపోకుండా కొంతమేరకు ఏపీ ఫైబర్ నెట్ ను తీసుకురావడం జరిగిందని, అలాగే వారి సమస్యలను కూడా పరిష్కరిస్తామని, ముఖ్యంగా ప్రైవేట్ కనెక్షన్లు కన్నా నాణ్యమైన, సరసమైన ధరలకు, ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లను 50 లక్షల కనెక్షన్ వరకు తీసుకొస్తామన్నారు.