

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5:- మహిళా సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తుందని స్త్రీ నిధి ఏజీఎం పి కామరాజు వెల్లడించారు. మంగళవారం నాడు ఆయన మహిళా సంఘాలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. స్త్రీ నిధి రుణాలు విధి విధానాల గురించి మంజూరు రికవరీ గురించి మండలంలో గల మహిళా సంఘాలకు వివో లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల్లో కొంతమంది వ్యక్తిగత రుణాలు తీసుకొని పలు రకాల స్వయంగా వ్యాపారాలు, చిరు వ్యాపారాలు పెట్టుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. వారి వ్యాపారాలు బట్టి వాళ్లకు బ్యాంకు లింకేజీ తో పాటు తగినంత రుణం మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 2025-26 పార్వతీపురం మన్యం జిల్లాలో సంవత్సరానికి గాను 86 కోట్ల రూపాయలు ప్రభుత్వం రుణాలు టార్గెట్ ఇవ్వగా సుమారు 20 కోట్ల రూపాయలు మాత్రమే రుణాలు ఇచ్చామని తెలిపారు. ఆ సంవత్సరానికి గాను 83% రికవరీ చేపట్టడం జరిగిందని తెలిపారు.2025 -26 సంవత్సరానికి గాను మండలంలో 95 లక్షలకు గాను 25 లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.2024-25 సంవత్సరానికి గాను 56 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేయగా 46 కోట్లు కేటాయించామని ఆ సంవత్సరానికి రికవరీ 96% వరకు చేశామని తెలిపారు. ఇక జిల్లాలో మొండి బకాయిలు నాలుగు మండలాల్లో రికవరీ చేయవలసి ఉందని తెలిపారు. జిల్లాలో 295 మహిళా సంఘాలు ఉండగా 975 సంఘాలకు స్త్రీ నిధి రుణాలు మంజూరు చేసామని తెలిపారు. బామిని పాచిపెంట బలిజిపేట సీతంపేట మండలాల్లో 65 సంఘాల నుంచి మొండి బకాయిలు రికవరీ చేయవలసి ఉన్నాదని ఆయన తెలిపారు. రికవరీ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయనతోపాటు సమావేశానికి డిపిఎం,ఏపీఎం, సీసీలు, వివోలు, మహిళా సంఘాలు తదితరులు హాజరయ్యారు.
