

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5:- ప్రకృతి సేద్యాన్ని పాటించే రైతులు రసాయన మందుల జోలికి పోకుండా కషాయాల ను ఉపయోగించి పురుగులు తెగుళ్లను అరికట్టుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. పోడు భూములలో మొక్కజొన్న పంట పండించి పురుగు మందుల పిచికారి చేసినట్లయితే తేనెటీగలు నశించి జీవ వైవిధ్యం దెబ్బతింటుందని కాబట్టి తెగుళ్లను కషాయాల ద్వారా మాత్రమే అరికట్టుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. తంగలాం మరియు వేటగాని వలస లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐ సి ఆర్ పి అప్పన్న ఆధ్వర్యంలో దశ పత్ర కషాయాన్ని తయారు చేయించారు. దశపర్ని తయారీ: – 200 లీటర్ల నీటిలో ఐదు లీటర్ల ఆవు మూత్రం ఐదు కేజీల ఆవు పేడ ఒక కేజీ వెల్లుల్లి ముద్ద అరకేజీ పసుపు కేజీ పచ్చిమిరప ముద్ద వంద గ్రాముల ఇంగువ రెండు కేజీల పొగాకు ఆకుల పొడి వేసి ఒక రోజంతా నానబెట్టి మరుసటి రోజు 10 రకాల ఆకులు ఒక్కొక్కటి రెండు కేజీలు చొప్పున బాగా దంచి నానబెట్టాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక కర్రతో కలుపుతూ 21 రోజులు ఉంచిన తర్వాత వడగట్టి ఎకరానికి ఐదు లీటర్లు చొప్పున పిచికారీ చేసుకుంటే తెగుళ్లు నివారణ జరగడమే కాకుండా పంట ఆరోగ్యంగా పెరుగుతుందని తెలిపారు. బెట్ట నివారణకు నానో యూరియా : –
గొట్టూరు వేటగాని వలస మూటకూడు తదితర పంచాయతీల పరిధిలో ఉన్న గ్రామాలలో గిరిజనులు వర్షాధార మొక్కజొన్న సాగు చేస్తున్నారు ప్రస్తుతం నేలలో తగినంత తేమ లేకపోవడం వలన ఎండ వేడిమి కి మొక్కజొన్న ఆకులు చుట్టుకుని పోతున్నాయి ఇలాంటి బట్ట వాతావరణాన్ని తట్టుకోవాలంటే రైతులు తప్పనిసరిగా ఎకరానికి అర లీటరు నానో యూరియా పిచికారి చేసుకోవాలని వ్యవసాయ అధికారి తెలిపారు నేలలో తేమ లేనప్పుడు బస్తాల ఎరువులు ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదని సూచించారు అనంతరం గ్రామాలలో ఉన్న వరి చిరుధాన్యాలు మొక్కజొన్న పంటలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సిఆర్పి సురేష్ ఐ సి ఆర్ పి లు రాజు సంజీవి మరియు రైతులు పాల్గొన్నారు.
