

ఉదయగిరి:(మనన్యూస్,ప్రతినిధి, నాగరాజు):
ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి టౌన్ పరిధిలో సిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సంఘటన వెలుగులోకి వచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళితే మూడవ తేదీ వరికుంటపాడు మండలం ఇరువురు గ్రామం సుభాషిని భర్త మహేష్ డెలివరీ నిమిత్తమై 108 నందు ఉదయగిరి ప్రాథమిక హాస్పిటల్స్ వచ్చి డాక్టర్ కి చూపించుకుని అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకున్నారు నాలుగవ తేదీ ఉదయం 11 :30 సమయంలో సుభాషిణికి పుటినొప్పులు రాగా పలుమార్లు నర్సులను పిలిచిన నర్సులు పట్టినట్టు వ్యవహరించారు డెలివరీకి వచ్చిన సుభాషిని హాస్పిటల్లోని పడక మీదే పురిటి నొప్పులతో అవస్థ పడుతూ వున్న పలుమార్లు నర్సులకు తెలియజేసిన పట్టించుకోని వైనంలో ఇదిగోవస్తున్నాం ఇప్పుడే వస్తున్నాం అంటూ కాలక్షేపన చేయటం పురిటినొప్పులతో బాధపడుతున్న స్త్రీ ని చూసి పక్క బెడ్ లో ఉన్న స్త్రీకి కనువిప్పు కలిగి ప్రసవం చేసింది.కనీసం సాటి స్త్రీగా నర్సులకు బాధ్యత లేకపోవడమే కాకుండాకనీసం గైనకాలజిస్ట్ డాక్టర్ కి పురిటి నొప్పులు వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ విషయంపైప్రశ్నించిన డాక్టర్ ను కూడా లెక్క చేయలేదు, డెలివరీ అయిపోయిన అర్థగంట తర్వాత నర్సులు వచ్చి బొడ్డు పేగు కత్తిరించి మీకేం ఇబ్బంది లేదు అంతా అయిపోయింది అంటూ చులకన భావం చూపించడం హాస్పిటల్ కి వచ్చిన వారి బంధువులను బెదిరించటం మరో కోణం,సుభాషిని భర్త మహేష్ స్పందన కు ఫిర్యాదు చేయటానికి అర్జీ రాసుకొని వెళితే సమయానికి మండల మేజిస్టేట్ లేకపోవడం తో వెను తిరిగి వచ్చారు.ఈ విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా అది మూడవ కాన్పు ఏమీ కాదు అంటూ తప్పించుకునే మార్గం చేశారు.
ఇది మొదటిసారి అయితే కాదు పలుమార్లు ఉదయగిరి సిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంతకుముందు కూడా జరిగి ఉన్నాయి. పై అధికారులు ఈ విషయంపై స్పందించి కఠినమైన మనస్తత్వం ఉన్న నర్సులపై తగ్గిన చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు బాధను వ్యక్తం చేశారు.