

మన న్యూస్: తిరుపతి, ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అని రాయలసీమ రంగస్థలి ఛైర్మెన్ గుండాల గోపినాధ్ అన్నారు. గురజాడ 109 వ వర్ధంతిని చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు ఈ సందర్భంగా గుండాల గోపీనాధ్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో గురజాడ అప్పారావు ఒకరని గుర్తు చేసారు. 19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయన్నారు . అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని పేర్కొన్నారు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. ఆయనకు కవి శేఖర అనే బిరుదు ఉందని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రంగస్థలి సభ్యులు విజయభాస్కర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, రామలింగేశ్వర కుమార్,చిత్తరపు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.