శ్రీ వారి ద‌ర్శ‌న భాగ్యాన్ని స‌ద్వినియోగం చేసుకోండిఃఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్: తిరుప‌తి, స్థానికుల‌కు శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌న భాగ్యం ఈనెల మూడవ తేదీ నుంచి ప్రారంభంకానున్న‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. స్వామి ద‌ర్శ‌నం పొందేందుకు సోమ‌వారం ఉద‌యం నుంచి టిటిడి టోక‌న్లు జారీ చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. తిరుప‌తి వాసులు మ‌హతి ఆడిటోరియంలో, తిరుమ‌ల‌వాసులు బాలాజీన‌గ‌ర్ లోని క‌మ్యూనిటీ హాల్ లో మంగ‌ళ‌వారం ఉద‌యం ఐదు గంట‌ల నుంచి టోక‌న్లు పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. స్వామి ద‌ర్శ‌నంకు వెళ్లే వాళ్ళు త‌మ ఒరిజిన‌ల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళి టోక‌న్లు పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు స్థానికుల‌కు శ్రీవారి ద‌ర్శ‌నాన్ని గ‌త నెల 18వ తేదీ జ‌రిగిన టిటిడి పాల‌క‌మండ‌లి తొలి స‌మావేశంలోనే పున‌రిద్ధ‌రించిన‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. తిరుప‌తి, తిరుమ‌ల వాసుల‌తోపాటు తిరుప‌తి రూర‌ల్, రేణిగుంట‌, చంద్ర‌గిరి వాసుల‌కు శ్రీవారి ద‌ర్శ‌నం ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం క‌ల్పించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. స్థానికుల‌కు శ్రీవారి ద‌ర్శ‌నం పున‌రుద్ధించ‌డానికి స‌హ‌క‌రించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ , టిటిడి ఛైర్మ‌న్ బిఆర్ నాయుడు, సభ్యులు మ‌రియు టిటిడి అధికారుల‌కు మ‌రొక్క‌సారి ఎమ్మెల్యే కృత‌జ్జ‌తులు తెలిపారు.

  • Related Posts

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    మన ద్యాస ప్రతినిధి, సాలూరు : – మండలంలోని మామిడి పల్లి శ్రీ సరస్వతీ శిశు మందిర్లో కమిటీ సభ్యులు, ఆచార్యులు నిర్వహించిన సప్త శక్తి సంగం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వక్తల సందేశాన్ని…

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    మన ధ్యాస ప్రతినిధి , సాలూరు డిసెంబర్ 7:- స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం. స్నేహం కంటే గొప్పబంధం మరేది లేదని 1987 సంవత్సరం పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవతరగతి బ్యాచ్ రుజువు చేసింది. ప్రతీ సంవత్సరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం