


మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 4:కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజు నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో సైబర్ నేరాలు,మాదకద్రవ్యాల వినియోగం,షీ టీమ్స్ సేవలు,
రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు,స్థానిక ఎస్ఐ శివకుమార్ నేతృత్వంలో జరిగింది.
ఈ సందర్భంగా బాన్సువాడ షీ టీమ్స్ సభ్యులు విద్యార్థులకు మహిళల భద్రత,అత్యవసర సమయంలో ఉపయోగపడే సేవల గురించి సమగ్రంగా తెలియజేశారు. ముఖ్యంగా టోల్‌ఫ్రీ నంబర్ 1930, షీ టీమ్స్ నంబర్ 8712686094, డయల్ 100, బరోసా హెల్ప్‌లైన్ 8712686096లను ఎలా వినియోగించాలో వివరించారు. అనంతరం ఎస్ఐ శివకుమార్ మాట్లాడుతూ..డ్రగ్స్,గంజాయి వంటి మాదకద్రవ్యాల వాడకానికి సంబంధించిన నష్టాలు,డ్రంక్ అండ్ డ్రైవ్,సెల్‌ఫోన్ వాడుతూ డ్రైవింగ్ వంటి ప్రమాదకర ప్రవర్తనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.చిన్నారులపై జరిగే నేరాలు,బాల్యవివాహాలు,లైంగిక దాడులపై చట్టపరమైన విషయాలను వివరించి,విద్యార్థుల్లో చట్టపట్ల అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, శేషారావు తమ పాటలు, సందేశాలతో కార్యక్రమాన్ని మరింత ఆసక్తికరంగా చేశారు.యువత సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తగా ఉండాలని,తల్లిదండ్రుల మాట వినాలని సూచించారు.
కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ఇన్చార్జి ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్, పాఠశాల సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.