

మర్రిపాడు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
ఈనెల 9వ తేదీన ఉదయగిరి శ్రీ రంగనాయకుల స్వామి వారి దేవస్థానం నందు శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడనున్న నేపథ్యంలో ప్రతి ఒక్క గ్రామంలో కళ్యాణం కు ముందు పసుపు దంచే కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహించి గ్రామంలో పెండ్లి పత్రికలు ఆహ్వానాల ప్రకారం పంపిణీ కార్యక్రమం జరగబడును ఆ కార్యక్రమంలో భాగంగా బొంత మారుపల్లి గ్రామంలో విశ్వహిందూ పరిషత్ కమిటీ మెంబర్స్ సంగన సుందరరామి రెడ్డి, అన్నవరపు కృష్ణా రెడ్డి, ఆకుల తిరుపతి ల ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళల చేత పసుపు దంచి పాంప్లెంట్లు వితరణ మరియు పెండ్లి పత్రికల ఇంటింటికి పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కమిటీ మెంబర్స్ ఇంటింటికి తిరిగి ఈనెల తొమ్మిదవ తేదీన ఉదయగిరిలో రంగనాయకుల స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవిల కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర సురేష్ విశిష్ట అతిథులు విచ్చేయబడునని మరియు శ్రీ పర్రి కోటేశ్వరరావు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా పాదాధికారులు మరియు విశ్వహిందూ పరిషత్ విభాగము విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన ఉన్నారని ఈ కళ్యాణం కు గ్రామ గ్రామాలనుండి ఇంటిల్లపాది తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దల, ప్రజలు పాల్గొన్నారు.