

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే టిడిపి ప్రభుత్వం పని చేస్తుందని, కలిగిరి మండల అభివృద్ధి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కే సాధ్యమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వృద్ధులకు మహిళలకు వితంతువులకు 4000 వేల రూపాయలు వికలాంగుల కు 6000 డయాలసిస్ పెషేంట్ లకు 10000 రూపాయలు పెంచిన ఘనత దక్కుతుందని, పొలంపాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కల్లూరి చంద్రమౌళి తెలిపారు..శుక్రవారం పొలంపాడు పంచాయతీలో ని SC మాదిగ పెలేం లో మరియు ST యానది కాలనీ లలోని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశానుసారం ముగ్గురు మహిళలకి కొత్తగా మంజూరైన పెన్షన్లను పంపించేశారు. కల్లూరి చంద్రమౌళి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులకు మహిళలకు వితంతువులకు వికలాంగుల లకు పెన్షన్లను వారి ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం భాగంగ గ్రామంలో ఇంటి వద్దకే వచ్చి, పెన్షన్ పంపిణీ చేశారు. పెన్షన్ లబ్ధి దారులతో మాట్లాడుతు చంద్రన్న ప్రభుత్వం ఎలా ఉంది, పెన్షన్స్ ను సకాలంలో అందుతుందా ఎంత వస్తుంది మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సహకారంతో అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.అంతే కాకుండా ఈ నెలలోనే సూపర్ సిక్స్ పథకాలు లో భాగంగా అన్నదాత సుకుభవ పథకం, మరియు మహిళలకు ఆగష్టు 15 నుంచి ఫ్రీ బస్సు పథకాలను నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉన్నిమద్దెల తిరుపలు,టీడీపీ స్థానిక నేతలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు..