ప్రవేట్ బస్టాండ్ కు స్థలం కేటాయించాలి.. ఎమ్మెల్యే ని కోరిన ప్రవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు…

మన న్యూస్,తిరుపతి :– ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో ప్రవేట్ బస్సుల కోసం ప్రవేట్ బస్టాండు కు స్థలం కేటాయించాలని ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా ప్రవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షులు రూపేష్, మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు కమల్, ప్రధాన కార్యదర్శి భాషా, కోశాధికారి మల్లికార్జున, కార్యదర్శి మురళి ఎమ్మెల్యేని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో కన్వీనర్ ముని రాజా యాదవ్, అధ్యక్షులు రూపేష్ లు మాట్లాడుతూ ప్రతిరోజు తిరుపతికి వందలాది ప్రైవేట్ బస్సులు రాకపోకలు కొనసాగిస్తుంటాయని, అయితే ప్రయాణికులు దిగడానికి ఎక్కడానికి బస్టాండ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కావున కూటమి ప్రభుత్వం తమ అసోసియేషన్ అభ్యర్థనను మన్నించి వీలైనంత త్వరగా ప్రైవేట్ బస్సుల బస్టాండ్ కోసం స్థలం కేటాయిస్తే ప్రయాణికులకు ఎంతో అనువుగా ఉంటుందన్నారు. అందుకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తమ విన్నపాన్ని సానుకూలంగా స్పందించారని, త్వరలో కార్పొరేషన్ అధికారులతో చర్చించి ప్రవేట్ బస్సుల బోర్డింగ్ కోసం స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..