హస్త కళాకారుల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తా…రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..

మన న్యూస్,తిరుపతి :– రాష్ట్రంలో హస్త కలలను కళాకారులను అభివృద్ధిపరిచేందుకు తన వంతుగా శాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చెప్పారు. గురువారం శ్రీకాళహస్తిలోని భానోదయ కలంకారి 15వ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన కలంకారి హస్తకళల వస్త్రాలు ప్రాచుర్యం పొందాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యానని పేర్కొన్నారు. కనుమూరు అవుతున్న కళలను, ఎంతో ఇష్టంతో నేర్చుకున్న కలంకారి హస్తకళ నేర్చుకొని కుటుంబంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఇంట్లో మగాళ్లకు తోడుగా ఆర్థికంగా మహిళలు తోడ్పాటు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తికి చెందిన కలంకారి ఆస్తకళ అన్ని విధాలుగా అభివృద్ధి జరిగే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో హస్తకళలకు ఆదరణ లేకపోవడంతో చాలావరకు కనుమరుగవుతున్నాయని వాటిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి దిశలోకి తీసుకెళుతున్నట్లు చెప్పారు. హస్తకళాకారులు ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులకు ఈ కలను నేర్పించాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో చర్చించి క్రాఫ్ట్ విలేజ్ గా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రధాన కార్యదర్శి పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న రాయల్ సహాయ కార్యదర్శి బాటసారి తిరుపతి సిటీ ఉపాధ్యక్షులు పార్థు శ్రీకాళహస్తి జనసేన నాయకులు కుమార్ మహేష్ లీలా చిరంజీవి, జయప్రకాష్ రెడ్డి, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..