

జగ్గంపేట జూలై 31 మన న్యూస్ :- 1970వ దశకంలో పి డి ఎస్ యు విజృంభణ విద్యార్థి నాయకుడిగా విప్లవ జీవితం ప్రారంభించిన కామ్రేడ్ మచ్చ నాగయ్య నిఖార్శయిన విప్లవకారుడుగా, నీతి నిజాయితీలతో అమలాపురంలో అసువులు బాసాడు .ఆ కామ్రేడ్ కు గురువారం నాడు జగ్గంపేట మండలం రామవరం గ్రామం రంగవల్లి నగర్ లో ఆంధ్రప్రదేశ్ రైతు-కూలి సంఘం, పి డి ఎస్ యు (విజృంభణ) సంఘాలు విప్లవ జోహార్లు అర్పించాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నకుల వీరాంజనేయులు మాట్లాడుతూ గోదావరిలోయ విప్లవోద్యమంలో సంభవించిన అనేక చీలిక పీలికల్లో సెంటిమెంటల్ గా కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి రాజకీయాలతో కొనసాగుతూ వచ్చాడు. బూర్జువ జీవితాన్ని, వ్యక్తిగత రాగద్వేశాలను ఏనాడు దరికి చేరనీయకుండా, ఎర్రజెండానే నమ్ముకుని బతికాడు అని ఆయన తెలిపారు.జీవితం-మరణం రెండూ కూడా ఆయన దృష్టిలో సాధారణ అంశాలు గానే కొనసాగాయని అన్నారు. అందుకే కామ్రేడ్ నాగయ్య విప్లవ జీవితాన్ని ఎత్తుపెడుతూ, ఆయన ఆదర్శాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళులు అని ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు విజృంభణ రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, అర్జున్,లక్ష్మి, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
