

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: మహిళా సాధికారిత కమిటీ ఆద్వర్యంలో పోష్ ఎక్ట్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి.సునీత అద్యక్షత వహించి పనిచేసే ప్రదేశాలలో మహిళల పై లైంగిక దాడులు జరగకుండా చూడాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి పై ఉన్నదని ఈ లైంగిక దాడుల గూర్చి ప్రొటెక్షన్ ఒఫ్ సెక్సువల్ హర్రస్మెంట్ ఎక్ట్ (పోష్) ఉన్నదని విషయం ప్రతి విద్యార్ది తెలుసుకోవాలని,అవసరమైనప్పుడు భయపడకుండా ఇంటర్నల్ కమిటీ కి తెలియపరచాలని స్వేచ్చ,సురక్షితమైన వాతావరణంలో బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని దాన్ని వినియోగించుకోవాలని కోరారు.అదే విధంగా అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దని,మోసాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని తెలియపరిచారు.ఏలేశ్వరం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు నూకరాజు మాట్లాడుతూ ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు మీ ఇంటర్నల్ కమిటీ కీ తెలియపరిచి ఉండాలని,తరువాత సమాచారం సంబందిత పోలీసు స్టేషన్ లో ఇవ్వాలని కోరారు.ఈకార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కె. వేంకటేశ్వరరావు,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా.ప్రయాగ మూర్తి ప్రగడ, అధ్యాపకులు కె.సురేష్,డా.మదీనా, డా.శివ ప్రసాద్,విమెన్ ఎమ్పౌఎర్మెంట్ కన్వెనర్ లక్ష్మి,వీరభద్ర రావు,డా.బంగార్రాజు,సతీశ్,రాజేశ్,ఉమెన్ ఎమ్పౌఎర్మెంట్ సభ్యులు కుమారి మేరీ రోజలీనా,పుష్పా,అధ్యాపకేత సిబ్బంది,పెద్ద సంఖ్యలో విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.