

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
కలిగిరి మండలం పెద్ద కొండూరు నీటి సంఘ మాజీ అధ్యక్షులు నోటి రమణారెడ్డిని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు గురువారం రమణారెడ్డి నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి రమణారెడ్డి వైద్య ఖర్చులకు 20000 రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో నేను ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంతో పని చేశారని ఆయన అన్నారు. అంతేకాకుండా పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనవడని ఆయన అన్నారు.