

పగలు సరిహద్దు ప్రాంతాల్లో డంపింగ్ రాత్రి వేళలో తమిళనాడుకు షిఫ్టింగ్, సుమారు 500 ఇసుక లోడ్లను డంపు చేసిన ఇసుక మాఫియా
ఎస్ఆర్ పురం,మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం క్షిరసముద్రం గ్రామ పక్కన ఉన్న పెద్ద వంక లో జెసిబి సహాయంతో పెద్ద వంకను పూడ్చి రహదారి లాగా ఏర్పాటు చేసుకుని జెసిబి ద్వారా ట్రాక్టర్లకు ఇసుకను తరలిస్తున్నారు గ్రామస్తులు ప్రశ్నిస్తే ఇసుక మాఫియా బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు క్షిరసముద్రం పెద్ద వంక నుంచి జెసిబి సహాయంతో ట్రాక్టర్లకు ఇసుకను నింపి సరిహద్దు ప్రాంతాల్లో డంపింగ్ చేసే రాత్రి వేళల్లో తమిళనాడుకు తరలించి లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని సమాచారం… క్షిరసముద్రం సరిహద్దు ప్రాంతంలో సుమారు 500 లోడ్ల ఇసుకను డప్పు చేసే దర్జాగా ఒక లోడ్ 3000 రూపాయలకు లోకల్లో అమ్ముతున్నారని స్థానికులు ఆరోపించారు ఈ ఇసుక మాఫియాను అడ్డుకునేవారు లేరా అంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు బుధవారం సాయంత్రం ఇసుక డంపింగ్ మరియు జెసిబి నీ ఎస్ఐ సుమన్ సీజ్ చేసే సీజ్ చేసినట్లు తెలిపారు. ఇసుక మాఫియా డంపు చేసే ఓ నాయకుడి ప్రధానానచరుడు మీడియాపై దౌర్జన్యం చేశారు.
