

కొంపల్లి. మన న్యూస్ :- కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి సుచిత్ర సర్కిల్లో గల టిఎన్ఆర్ నార్త్ సిటీ లోని రెండవ అంతస్తులో పియూష్ అగర్వాల్ నేతృత్వంలోని మిని సో స్టోర్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ మూడవ స్టోర్ అన్నారు.మిని సో లో సరసమైన ధరలలో స్టైలిష్ మరియు అధిక నాణ్యత గల పెర్ఫ్యూమ్స్,సాఫ్ట్ టాయ్స్,గిఫ్ట్స్,బ్యాగ్స్, సౌందర్య సాధనాలు,హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో గోపాల్ అగర్వాల్,పుష్ప అగర్వాల్, మయూర్ అగర్వాల్, మృధుల్ అగర్వాల్ బంధుమిత్రులు పాల్గొన్నారు