

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్ లో వసతులు సరిగ్గా లేవని కలెక్టరేట్ కు ర్యాలీగా బయలు దేరిన విద్యార్థులు. కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడానికి పాదయాత్రగా వెళ్తున్న విద్యార్థులను అడ్డుకొని తిరిగి స్కూలుకు పంపించిన పోలీసులు పురుగుల అన్నం తింటున్నామని తాగడానికి మంచినీళ్లు బాత్ రూమ్ లు సరిగ్గా లేక మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్న సార్ వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు . స్కూల్స్ ప్రారంభం అయినప్పటి నుండి మేము ఎన్నోసార్లు చెప్తున్న పట్టించుకోవడం లేదంటున్న విద్యార్థులు, వసతుల గురించి అడిగితే మ్యాథ్స్ టీచర్ రజిత దుర్భాషలాడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. మహాత్మా జ్వోతిరావు పూలే విద్యార్థులు మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థులు చదుకోసం భవిష్యత్ కోసం ఎక్కడ ఎక్కడనుండి వస్తే గురుకుల పాఠశాలలో పురుగులు అన్న ఉప్పు నీరు తాగాలి బాత్రూంలో సరైన వసతి లేవు మ్యాస్ సబ్జెక్టు రజితకు అన్నంలో పురుగులు ఉన్నాయి మేడం అని చెబుతే మీ కడుపులో పురుగులు ఉన్నావి కదా ఇవి ఏమి కదూలే అని సమాధానం ఇస్తుంది గతంలో ఒక విద్యార్థికి తల్లిదండ్రులుకు ఫోన్ చేయ్యండి మేడం అడిగితే ఫోన్ తీసుకోని విద్యార్థులు పై ఫోన్ తో తలకు వేసి కొట్టడంతో విద్యార్థికి స్వల్ప గాయం కావడంతో ఏమి కాదులే అదే కప్పిపుచ్చుకోంది ఇంకా పెద్ద ప్రమాదం జరిగింటే మేము ఎవరు చెప్పుకోవాలి అని విద్యార్థులు తెలిపారు. ప్రతి గురుకుల పాఠశాలకు నేల ఒక్కసారి జిల్లా కలెక్టర్ తనిఖీలు చేయాలి. సీఐ రవిబాబు విద్యార్థులతో మాట్లాడుతూ మీరు ఇలా రహదారి పై వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగే ఆవకాశం ఉంది గురుకుల పాఠశాల సమస్యలు కలెక్టర్ చేప్పి పరష్కారం చేసే విధంగా చూస్తాం అని నచ్చచేపడంతో విద్యార్థులు ఇటిక్యాలపాడు స్టేజీ నుంచి పోలీసుల ప్రత్యేక వాహనం పై గురుకుల పాఠశాల కు తరలించారు.


