

వెంకటగిరి ముత్తూట్ మినీ ఫైనాన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవంలో ఏఏంసి చైర్మన్ పునుగోటి విశ్వనాధం.వెంకటగిరిలో లాంఛనంగా ప్రారంభం అయిన ముత్తూట్ మినీ గోల్డ్ లోన్ ఫైనాన్స్ సేవలు
గూడూరు, మన న్యూస్ :- గోల్డ్ లోన్ ఫైనాన్స్ రంగంలో ముత్తూట్ మినీగోల్డ్ లోన్ ఫైనాన్స్ అగ్రగామిగా నిలవాలని వెంకటగిరి ఏఏంసి చైర్మన్ పునుగోటి విశ్వనాధం ఆకాంక్షించారు.తిరుపతిజిల్లా వెంకటగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాధం,పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు మంకు ఆనంద్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయనకు ముత్తూట్ మినీ ఫైనాన్స్ చిత్తూరు రీజనల్ మేనేజర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో స్థానిక సిబ్బంది ఘన స్వాగతం పలికారు.రిబ్బన్ కట్ చేసి,జ్యోతి ప్రజ్వలన గావించి గోల్డ్ లోన్ లావాదేవీలను ఈ సందర్భంగా ప్రారంభించారు.ఖాతాదారులకు లోను పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం పుస్తకాలను విశ్వనాధం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏఎంసి చైర్మన్ మాట్లాడుతూ ముత్తూట్ మినీ ఫైనాన్స్ దేశవ్యాప్తంగా వినియోగదారుల మన్ననలు పొందుతున్నారు.వెంకటగిరిలో ముత్తూట్ మినీ సేవలు ప్రారంభ కావడం ఆనందనీయమన్నారు.దిన దినా అభివృధి చెంది వెంకటగిరిలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు.చిత్తూరు రీజియన్ మేనేజర్ గోపీనాథ్ మాటాడుతూ తిరుపతి రీజియన్ పరిధిలో వెంకటగిరి ముత్తూట్ మినీ ఫైనాన్స్ అగ్రస్థానంలో నిలవాలని అక్షించారు.తిరుపతి రీజియనల్ మేనేజర్ షేక్.మస్తాన్ పర్యవేక్షణలో గోల్డ్,ఇన్సూరెన్స్ విభాగాల్లో బ్రాంచ్ విజయవంతంగా అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నందా స్వీట్స్ అధినేత నందా, వెంకటగిరి బ్రాంచ్ మేనేజర్ ఉడతా శశిధర్, శ్రీ కాళహస్తి బ్రాంచ్ మేనేజర్ పోలూరు రత్నకుమార్,సిబ్బంది హరీష్,జ్యోతి వెంకట రమణ,ప్రకాశ్, శిరీష చౌదరి పాల్గొన్నారు.
