తప్పిపోయిన ఇద్దరు బాలికల ఆచూకీని 3 గంటల్లో ట్రేస్ చేసినఇంద్ర పాలెం పోలీసులు

కాకినాడ జూలై 29 మన న్యూస్ :- కాకినాడ రూరల్ మండలం ఎస్. అచ్యుతాపురం గ్రామానికి చెందిన తప్పిపోయిన ఇద్దరు బాలికల ఆచూకీని ఇంద్ర పాలెం పోలీసులు 3 గంటల్లో అమలాపురంలో విజయవంతంగా గుర్తించారు. ఇంద్ర పాలెం ఎస్‌ఐ, సిబ్బంది ముమ్మర దర్యాప్తు చేపట్టి, బాలికను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చారు.వివరాల్లోకి వెళితే,ఎస్. అచ్యుతాపురం నివాసి తంగేళ్ల సూర్య నాగమ్మ (భర్త నరసయ్య, 33 సం.) తమ కుమార్తె సోమవారం ఉదయం కళాశాలకు వెళ్లిన తర్వాత కనిపించకుండా, రామారావుపేట లోని సంజీవ్ జూనియర్ కాలేజ్ నుండి వెళ్లిపోయిన తంగెళ్ల లావణ్య మైనర్ కుమార్తె తో వెళ్లి పోయినదని తెలిసి రాత్రి పొద్దుపోయిన తర్వాత అందిన ఫిర్యాదుతో,ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎమ్. వీరబాబు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, కాకినాడ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అఫ్ పోలీసు పాటిల్ దేవరాజ్ మనీష్ ఆదేశాల మేరకు కాకినాడ రురల్ ఇన్స్పెక్టర్ డీఎస్. చైతన్య కృష్ణ సూచనల మేరకు, ఇంద్ర పాలెం పోలీస్ స్టేషన్ ఎస్సై ఎమ్. వీరబాబు, సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ మరియు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా బాలిక అమలాపురం వైపు వెళుతున్నట్లు గుర్తించి, అమలాపురం పోలీసుల సహకారాన్ని కోరారు. వారి సమన్వయంతో కూడిన కృషి ఫలితంగా, తప్పిపోయిన బాలికలను ఉదయం అమలాపురంలో కనుగొని, బాలికలును వారి తల్లిదండ్రులకు అప్పగించినారు, దీనిపై బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకున్నారు.కాకినాడ జిల్లా పోలీసులు చూపిన అప్రమత్తత, వేగవంతమైన చర్యలు మరియు ఇతర పోలీసు విభాగాలతో సమర్థవంతమైన సమన్వయంతో బాలికలును సురక్షితంగా గుర్తించి, కుటుంబానికి అప్పగించిన కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ మరియు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎమ్. వీరబాబు, సిబ్బందిని ఎస్పీ అభినందించినారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 6 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…