ఎకరానికి 330 రూపాయలతో మొక్కజొన్న పంటకు పంటల భీమా – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జులై 29 :-పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో రైతులు మొక్కజొన్న పంటకు ఎకరానికి 330 రూపాయలు తో పంటల భీమా చేయించుకోవాలని ఆఖరి తేదీ జూలై 31 అని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. మిత్తి వలస వలస గ్రామంలో వి ఏ ఏ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులందరూ తప్పనిసరిగా పంటల భీమా చేయించుకోవాలని వరి పంటకు ఎకరానికి 800 రూపాయలు తో ఆగస్టు 15 వరకు సమయం ఉందని మొక్కజొన్న రైతులు కు సమయం తక్కువగా ఉన్నందున దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రాల ద్వారా లేదా గ్రామ సచివాల ద్వారా లేదా పోస్ట్ ఆఫీస్ ల ద్వారా పంటల బీమా చేయించుకోవాలని మొక్కజొన్న మరియు వరి పంటలపై బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందిన రైతులు బ్యాంకులలో ప్రీమియంను మినహాయించమని కోరాలని తెలిపారు.పంటల భీమా ప్రకృతి వైపరీత్యాల నష్టాల నుండి ఆదుకుంటుందని రైతులు పంటలకు బీమా చేయించుకోవడానికి ఒక అలవాటుగా మార్చుకోవాలని కోరారు ఏంటి అవసరాల కోసం మాత్రమే వాడే వరి పంటలో ఎలాంటి ఎరువులు పురుగు మందులు వేయకుండా పండించుకోవాలని ప్రకృతి సేద్యానికి అవసరమైన తోడ్పాటు అందిస్తామని తెలిపారు.ప్రస్తుతం ఎదిగిన పంటలపై బస్తా యూరియా ఎరువులు వాడకుండా నానో యూరియా నానో డిఏపి వాడుకోవడం ద్వారా ఎరువుల వృధాను అరికట్టి సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని తెలిపారు.ప్రస్తుతం పత్తి పంటపై పేను బంక ఆశించిందని దీని నివారణకు తయోమెథాక్సిమ్ అనే మందును 100 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్క బాగా తడిచేటట్టు పిచికారి చేయాలని సూచించారు పంటల అధిక దిగుబడికి భూమిలో సేంద్రీయ పదార్థం ఎక్కువగా ఉండాలని నవధాన్యాల ద్వారా భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంచవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్ద కొత్తవి పోలినాయుడు మాట్లాడుతూ ఎరువులకు గోడౌన్ చూపిస్తామని తమ గ్రామానికి రైతు సేవా కేంద్రానికి చాలా దూరంగా ఉందని దాని వలన సకాలంలో ఎరువులు అందడం లేదని కాబట్టి రెండు పంటలు పండించే రైతులో ఉన్నందున గ్రామంలో ఎరువులు అందేటట్టు చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు