

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో మంగళవారం భూభారతి సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా గిర్దవార్ చండూరి అంజయ్య మాట్లాడుతూ.. ఇటీవల కాటేపల్లి గ్రామంలో జరిగిన భూభారతి రెవిన్యూ సదస్సులో 10మంది రైతులు తమ భూమిని సర్వే చేయాలని దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సర్వే చేసి రిపోర్ట్ ను తహసీల్దార్ కు సమర్పిస్తామని ఆయన తెలిపారు.ఆయన వెంట సర్వేయర్ వెంకట్ ఉన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్, నాయకులు బోధనం విట్టల్,ఆకుల రాంచందర్,రాజుదేశాయ్, చౌటకూరి క్రాంతి కుమార్ యాదవ్, జంగం నరేష్ ,తదితరులు పాల్గొన్నారు.