

శ్రీకాళహస్తి, Mana News :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చెరగని ముద్ర వేసి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది, గడచిన ఏడు దశాబ్దాలుగా ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తున్న బొజ్జల కుటుంబం అసలైన విద్యా ప్రదాతలు అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు కొనియాడారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 18 వ వార్డు, 50 వ బూత్ పరిధిలో గల పి.వి.రోడ్డులోని ప్రజలను కలిసి ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా కాలంలో జరిగిన సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గడచిన వైసిపి ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి స్కిట్ కళాశాలను మూతపడేలా చేసి, నియోజకవర్గ పరిధిలో ఉన్న అనేక వసతి గృహాలను, పాఠశాల లను, కళాశాలలను కనీసం మరమ్మత్తులు చేయకుండా శిధిలావస్థకు చేర్చారని. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నికైన వెంటనే స్కిట్ కళాశాలను పునః ప్రారంభించి, తరగతులు నిర్వహించేలా చేసిన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించారని సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుధీర్ రెడ్డి పట్టుబట్టి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో స్కిట్ కళాశాలను తెరిపించి, జేఎన్టీయూతో అనుసంధానం చేయించి స్కిట్ కళాశాలకు పునర్జీవనం చేశారని హర్షం వ్యక్తం చేశారు.
గడచిన ఏడు దశాబ్దాలుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సంక్షేమం మరియు నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న బొజ్జల కుటుంబం శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచి పోయేలా సేవలందించారని కొనియాడారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిసరాలలో ఉన్న వేలాది మంది విద్యార్ధినీ, విద్యార్థులకు అత్యుత్తమమైన సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావాలని మాజీ మంత్రి, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. పట్టణంలో నర్సింగ్ కళాశాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జాతీయ విద్యా సంస్థలు ఐఐటి, ఐషర్ లు ఏర్పాటు చేసేందుకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేసిన అనిర్వచనీయమైన కృషిని ప్రజలు ఎప్పటికీ మరచిపోరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరధాచారి, వన్నియకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, క్లస్టర్ ఇన్ఛార్జి పేట బాలాజీ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, తిరుపతి పార్లమెంటు నాయకులు సయ్యద్ చాంద్ బాషా, సంజాకుల మురళీకృష్ణ, కుమార్, భగత్, తుపాకుల ప్రసాద్, మురళీ నాయుడు, బీమాల భాస్కర్, కృష్ణమూర్తి, మణి, హర్ష తదితరులు పాల్గొన్నారు.