అభివృద్ధి సంక్షేమం సిఎం చంద్రబాబుకు రెండు కళ్ళు

వచ్చే నెలలో ఉచిత బస్సు అన్నదాత సుఖీభవ, సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం లో మంత్రి సంధ్యారాణి

మన న్యూస్ పాచిపెంట, జూలై 28:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట లోగత ప్రభుత్వం చేసిన అరాచకాలు,అక్రమాలు కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధి ఆగలేదని అపర చాణిక్యుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ప్రగతి పదములో నడిపిస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్యమంత్రి ని కొనియాడారు. సోమవారం నాడు మండల కేంద్రమైన పాచిపెంట గ్రామంలో ప్రభుత్వం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అధితిగా విచ్చేసిన మంత్రి సంధ్యారాణికి ప్రజలు భ్రహ్మ రధం పట్టారు. పాచిపెంట మెయిన్ రోడ్డు గుండా టాప్ లెస్ జీప్ లో ఊరేగిస్తూ అడుగడుగునా పువ్వుల వాన కురిపిస్తూ హారతులు,సన్మాన, సత్కారాలు గావిస్తూ మంత్రికి మహిళలు నీరాజనాలు పలికారు. వారి ఆదరణ అభిమానానికి సంధ్యారాణి మంత్రముగ్ధులయ్యారు. ఊహించని విధంగా ఆమెకు దారి పొడుగునా హారతులు పట్టడం చూసి ఇంతవరకు తాను పాచిపెంట మండలంలో భారీ ఎత్తున మహిళలు హాజరు కావడం ఇదే మొదటి సారి అనిఅన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మనమంతా కృతజ్ఞతలు తెలపాలని కోరారు. ఈరోజు ఈ కార్యక్రమంకు భారీ ఎత్తున తరలివచ్చిన జన సమూహానికి తాను రుణపడి ఉంటాను అని అన్నారు.పార్టీ సీనియర్లు కూడా సభలో కొనియాడడం ప్రశంసనీయం. గత ఎన్నికలలో తాను గెలవడానికి పురుషుల కంటేఎక్కువ మహిళలే నాకు ఓటు వేసి గెలిపించారని వారి రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదని ఆనందం వ్యక్తం చేశారు. పాచిపెంట మండలానికి 15కోట్ల రూపాయలు తో 186 గోశాలలు, మంజూరు చేసామని తెలిపారు. ఆగస్టు 15 కి ఎకరాలు పోడు భూములకు డి పట్టాలు రెడీ చేసి రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. మన రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కారని అందులో భాగంగా ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం గుర్తించిన ప్రజలు మమ్మల్ని ఎన్నుకొన్నారని తెలియజేశారు. తల్లికి వందనం అంత మంది విద్యార్థులకు అందజేస్తున్నామని పల్లె పండగలో రహదారులు నిర్మించామని, ఆగస్టు నెలలో రెండు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆగస్టు 15 తేదీ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే మరో వారం రోజుల్లో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు డబ్బులు వారి అకౌంట్లో వేస్తామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేయడం జరుగుతుందని ఆమె డంకాపదంగా సభలో ప్రసంగించారు. మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అందించామని గుర్తు చేశారు. అలాగే పూడి నుంచి వణుకు వలస గిరిజన గ్రామం వరకు రహదారి నిర్మాణం కోసం 4.75 కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయని, సరాయివలస ఆశ్రమ పాఠశాల అభివృద్ధి కోసం నాలుగు కోట్లు రూపాయలకు పైగా నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గతంలో తనకు పిల్లలు సమస్యలు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించుకొచ్చానని తెలిపారు.కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని కొంతమంది మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని వారి మాటలు నమ్మి మోసపోవద్దని సభకు విచ్చేసిన ప్రజలకు ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రహదారుల అభివృద్ధి చేశామని, పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచి ముసలి, వికలాంగులు, విడోలుకు వెన్ను దన్నుగా నిలిచామన్నారు. గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని ఎద్దేవ చేశారు. సైకో జగన్ శవాలపై రాజకీయం చేయడం, శవాలు దగ్గర నవ్వడం పలకరించడం, గంజాయి స్మగ్లర్లు విగ్రహాలు ప్రారంభించడం, తల్లి చెల్లెలను గెంటి వేయడం వలన ప్రజలు ఛీ కొట్టి 11 సీట్లు ఇచ్చారని అయినప్పటికీ బుద్ధి రాలేదని మంత్రి ఆగ్రహం చెందారు. ముఖ్యమంత్రిగా ఎన్నో తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడో అరెస్టుచేసి జైల్లో పెట్టాలని కానీ మా నాయకుడు అలా చేయలేదని అదే ఆయన గొప్పతనం అని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో తప్పు చేసిన అధికారులు మాకు అక్కర్లేదని నిజాయితీపరులు ఉండాలన్నారు. పాచిపెంట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యుగంధర్ సమక్షంలో మోదుగ గిరిజన పంచాయతీలో కొంతమంది గిరిజన కుటుంబాలు వైసీపీ నుంచి టిడిపిలో చేరారు.పార్టీలో చేరిన వారికీ మంత్రి సంధ్యారాణి చేతుల మీదుగా కండువాలువేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి పథకాలుగురించి ప్రజలు కు వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషిచేసిన మండల పార్టీ అధ్యక్షులు యుగంధర్,స్థానిక నాయకులు ఎంపీటీసీ పల్లేడ ఉమామహేశ్వరరావు, సాలూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింగరావు, మండల పార్టీ యూత్ అధ్యక్షులు కనక బాబు,పార్టీ సీనియర్ నాయకులు మతల బలరాం, పోలినాయుడు, మెహర్ బాబా, మజ్జరావు లను మంత్రి సంధ్యారాణి కొనియాడారు. పాచిపెంట ఎంపీడీవో బీజే పాత్రో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సభ ముగిసేంతవరకు వచ్చిన ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.చివరిగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజలను ఉద్దేశించి ఒక్క మాట చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా తన వీధిలో తన గ్రామంలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిన విషయం ఏమిటంటే ప్రతి ఇంట్లో మీ పిల్లలను చక్కగా చదివించాలని చదువుకుంటే ప్రయోజకులై మీ ఇల్లు అభివృద్ధి చెందుతుందని ఇది నా మాటగా చెబుతున్న దయచేసి అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రజలు అందించిన వినతులు అందుకున్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 2 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు