

గూడూరు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రజల ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి చేయండి: భారతీయ జనతా యువమోర్చా అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్
గూడూరు, మన న్యూస్ :- భారతీయ జనతా యువమోర్చా గూడూరు మరియు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని మరియు పంబలేరు బ్రిడ్జి పూర్తి చేసి గూడూరు ప్రజల కష్టాలు తీర్చాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కి వినతి పత్రం అందజేసిన భారతీయ జనతా యువమోర్చా గూడూరు నాయకులు ఈ సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ 22 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గూడూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు తర్వాత కొంత మేరకు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. 15 సంవత్సరాల గడుస్తున్నా గాని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో గూడూరు ప్రజలు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది గూడూరు టూ టౌన్ కు వెళ్లాలంటే ట్రాఫిక్ లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అదే విధంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే గూడూర్ అభివృద్ధి కూడా జరుగుతుందని ఇప్పటికైనా అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని వారు కోరారు మరియు సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా నగర అధ్యక్షులు శివశంకర్, బీజేవైఎం నాయకులు కిరణ్, నవీన్ ,మహేష్ ,ప్రసాద్ , చైతన్య, వసంత్ తదితరులు పాల్గొన్నారు.
