

పాలసముద్రం మండలం, Mana News:అఖిల భారత యాదవ సంఘం తిరుపతి,జనరల్ సెక్రటరీ నవీన్ యాదవ్ ని చిత్తూరు దొడ్డి పల్లి లో పాలసముద్రం మండలం వనదుర్గాపురం పంచాయతీ కి చెందిన పి.పురుషోత్తం యాదవ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి వెనుకబడిన యాదవ కుటుంబాల అభివృద్ధి కోసం సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా ఎన్నారై పురుషోత్తం యాదవ్ మాట్లాడుతూ యాదవుల మొత్తం యాదవ సంఘం కు కృషి చేయాలని యాదవులకు సంబంధించిన హక్కులను తెలియజేసుకోవాలని యాదవులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే యాదవుల సంఘం అండగా నిలబడుతుందని. ప్రతి ఒక యాదవులు యాదవ్ సంఘంలో మెంబర్షిప్ కార్డు తీసుకోవాలని ప్రభుత్వం తరఫున వచ్చే పథకాలు ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.