

మన న్యూస్,నిజాంసాగర్(జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో సుమారు రెండు సంవత్సరాల క్రితం అన్ని సౌకర్యాలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ఇప్పటికీ ప్రారంభించకపోవడం బాధాకరం.లక్షలాది రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ భవనం వినియోగంలోకి రాకపోవడంతో,ప్రస్తుతం పాత చావిడిలోనే పంచాయతీ కార్యాలయం కొనసాగుతోంది.ప్రజలు,సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నూతన భవనం నిర్మాణం పూర్తై కూడా ప్రారంభించకపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు స్పందించి వెంటనే నూతన భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని వారు కోరుతున్నారు. గ్రామ అభివృద్ధికి ఇలాంటి భవనాలు ఉపయోగపడే విధంగా వినియోగించాలన్నది స్థానికుల అభిప్రాయం.