

వెదురుకుప్పం, జూలై 27, మన న్యూస్:– మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్ సూచనలతో వెదురుకుప్పం మండలంలోని బొమ్మయ్యపల్లి గ్రామ పంచాయతీ, చిన్న బొమ్మయ్యపల్లి గ్రామం మరియు తెల్లగుండ్లపల్లి గ్రామ పంచాయతీలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం జూలై 27, 2025న ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లోకనాథ రెడ్డి, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్, క్లస్టర్-04 చంగల్ రాయ్ రెడ్డి, సీనియర్ యువ నాయకులు భాష్యం సతీష్ నాయుడు, రాజాజీ, నాగార్జున్, తెల్లగుండ్లపల్లి బూత్ కన్వీనర్ గుణశేఖర్ రెడ్డి, ఇనాం కొత్తూరు సర్పంచ్ మమత మోహన్ రెడ్డి, యువ నాయకులు భాను ప్రకాష్, పవన్ కుమార్ (రామకృష్ణాపురం బూత్ కన్వీనర్) తదితరులు పాల్గొన్నారు. అలానే చిత్తూరు జిల్లా ఎస్సీ మోర్చా ప్రతినిధులు పాముల శేషాద్రి కుమార్, రాజు, వెంకటేష్, రిషిత్, వెంకయ్య, భీమశంకర్ రెడ్డి, మురగయ్య, ఢిల్లీ, సీనియర్ నాయకులు రెడ్డి కుమార్, సుధాకర్ రెడ్డి, సతీష్ కుమార్, నెల్లపల్లి నుండి వినయ్, ధనంజయులు, బొగ్గల బాబు, యోహాను దాస్, కొల్లు లక్ష్మీకాంత్, హరి, సునిల్, హేమాద్రి, కిరణ్, నరేష్, చిరంజీవి, చందు, లక్ష్మయ్య, తులసి, కుమార్, డేటా అనలిస్ట్ మారేపల్లి మురళి తదితర పలువురు యువ నాయకులు, మహిళలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ మరియు కో-బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. గ్రామస్థులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఉత్సాహంతో కార్యక్రమం విజయవంతమైంది.