పారిశుద్ధ్య కార్మికులు పనులు ప్రైవేట్ వర్క్ కాంటాక్ట్ కి అప్పగించే పని మానుకోవాలి. సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం డిమాండ్

గూడూరు, మన న్యూస్ :- మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పనులు ప్రైవేట్ వర్క్ కాంటాక్ట్ కి అప్పగించే పని మానుకోవాలని సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు మరియు మున్సిపల్ ఫెడరేషన్ గౌరవా ధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు లోని సి.ఐ.టి.యు కార్యాలయంలో ఏ.పీ.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సి.ఐ.టి.యు అనుబంధం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశo జిల్లా కార్యదర్శి ధారా కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ 17 రోజులు సమ్మె సందర్భంగా ఒప్పుకున్న అంశాలకు జీ.వో. లు ఇప్పటివరకు జారీ చేయలేదని, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సొంత మున్సిపాలిటీ అయిన నెల్లూరులో మున్సిపల్ కార్మికుల పనులు ప్రైవేట్ వర్క్ కాంటాక్ట్ కి పని ప్రవేశ పెట్టడం అత్యంత దారుణమని వెంటనే విరమింపజేయాలని, ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ సంఘం జిల్లా అధ్యక్షులు వడ్డీ పల్లి చెంగయ్య మాట్లాడుతూ గత 17 రోజులు సమ్మె సందర్భంగా ఇంజనీరింగ్ వర్కర్స్ కు జీతాలు పెంపుకు కమిటీ వేశారని, కాలయాపనతో తప్ప పరిష్కారానికి నోచుకోలేదని, మున్సిపల్ శాఖ మంత్రి, రాష్ట్ర నాయకులు, జులై మూడో తేదీన మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ జీతాలు విషయం కోరగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఏడాది పాటు జీతాలు పెంచడానికి వీలుపడదని తెలియజేశారని, సమ్మెకు పూనుకున్న తర్వాత ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచడం జరిగిందని, ప్రభుత్వ అనుకూల సంఘాలు, అవకాశవాద సంఘాలు, విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్నారని, సి.ఐ.టి.యు కార్మికులు ఒంటరిగానే పోరాటం చేసి విజయాన్ని సాధించుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గూడూరు మున్సిపల్ సంగం గౌరవాధ్యక్షులుగా జోగి. శివకుమార్, అధ్యక్షులుగా భూలోకం.రమేష్, ఉపాధ్యక్షులుగా డి.మణెమ్మ,ఎం. వెంకటరమణ,జి.మణి.ఆర్. ఆనంద్, ప్రధాన కార్యదర్శిగా భూలోక మురళి, సహాయ కార్యదర్శి జి.మేరీ.ఏ.శాంతి వర్ధన్,కే.నారాయణమ్మ, కోశాధికారి సి.హెచ్.రాజేష్, మరియు పదిమంది కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి బి.వి. రమణయ్య, ఉపాధ్యక్షులు అడపాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ