
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : వరి పంటలో కలుపు నివారణ ముందుగా గుర్తించి చర్యలు చేపడితే మంచి దిగుబడి సాధ్యమని ఏరియా జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ సూచించారు. మక్తల్ మండలంలోని పస్పుల గ్రామ రైతు వేదికలో నాగార్జున కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు వరి పంట పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. వరి సాగులో కలుపు నియంత్రణ కు ఉపయోగించాల్సిన మందులు పాటించాల్సిన పద్దతులు నీటి యాజమాన్యత అలాగే వరి సాగు లో తెగుళ్లు రాకుండా ముందుగా ఉపయోగించాల్సిన మందులు తీసుకోవల్సిన జాగ్రతలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ పూర్ణచంద్ర రెడ్డి, ఆశప్ప, రాజేంద్ర ప్రసాద్, రవి, లక్ష్మీకాంత రెడ్డి, భరతసింహ రెడ్డి, పట్వారీ అంజి , ఏరియా జనరల్ మేనేజర్ అనిల్, సీనియర్ రీజినల్ మానేజర్ కిశోర్ , దినేశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.